20 నుంచి యాదగిరిగుట్టలో కార్తీకోత్సవాలు | Yadagirigutta Karthika Utsavams poster unveiled | Sakshi
Sakshi News home page

20 నుంచి యాదగిరిగుట్టలో కార్తీకోత్సవాలు

Nov 8 2026 4:06 AM | Updated on Nov 8 2026 4:06 AM

Yadagirigutta Karthika Utsavams poster unveiled

కార్తీకోత్సవం పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఈవో భవానీశంకర్‌

ఆలయ ఈవో భవానీశంకర్‌ వెల్లడి

సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానంలో కార్తీకోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో భవానీశంకర్‌ తెలిపారు. తొలిసారిగా ఈ ఏడాది మూడ్రోజులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులోని త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల స్థాయిలో జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే ఎల్‌నినో ప్రభావం నుంచి బయటపడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రా«రి్థస్తూ కోటి పుష్పార్చన చేపడుతున్నామని ఈవో చెప్పారు.

 ఈనెల 19, 20 తేదీల్లో కోటి పుష్పార్చన కార్యక్రమం జరుగుతుందన్నారు. 20వ తేదీ నుంచి 22 వరకు మూడ్రోజుల పాటు కార్తీకోత్సవం ఉంటుందని, 20న మాడవీధిలో సహస్ర అవధాని నాగఫణి శర్మ ప్రవచనం, తేలు విజయ్‌తో భక్తి సంగీత కార్యక్రమం, నవంబర్‌ 21న ప్రముఖ సినీసంగీత దర్శకుడు ఆర్‌.పి.పటా్నయక్‌తో భక్తి సంగీత విభావరి, 22న పరప్పర వారితో ఒడిస్సీ, పేరిణీ నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. వైటీడీ పాలకవర్గం తీర్మానం మేరకు ఈ కార్యక్రమాలను రూపకల్పన చేశామన్నారు. పలు చోట్ల హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయడం, సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం, పోస్టర్లు విడుదల చేస్తామని వెల్లడించారు.  

కార్తీకోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ: ఈనెల 20, 21, 22 తేదీల్లో యాదగిరిగుట్ట దేవస్థానం నిర్వహించే కార్తీకోత్సవ కార్యక్రమాల పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ ఆవిష్కరించారు. వారి వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవానీశంకర్, దేవస్థానం అధికారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement