హైదరాబాద్: గ్రూప్ వన్, టూ, ఫోర్ అభ్యర్థులు మీరు గెలిచారు.. మమ్మల్నీ గెలిపించండి అంటూ గ్రూప్ త్రీ అభ్యర్థులు వేడుకుంటున్నారు. గ్రూప్ వన్, టూ, ఫోర్, జేఎల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో ఇప్పటికే సెలెక్ట్ అయ్యి అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకున్న అభ్యర్థులు గ్రూప్ త్రీకి కూడా దరఖాస్తు చేసుకుని, వెబ్ ఆప్షన్ ఇచ్చినవారు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రావొద్దని వేడుకున్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రూప్ త్రీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు వినయ్ కుమార్, మధు, మోహన్ కృష్ణ, వెంకటేష్ మాట్లాడారు.
గ్రూప్ వన్‌లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు సుమారు 100 మంది వరకు గ్రూప్ త్రీకి కూడా దరఖాస్తు చేసుకున్నారని, గ్రూప్ టూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు సుమారు 400 మంది గ్రూప్ త్రీకి కూడా దరఖాస్తు చేసుకున్నారని, వీరు ఇప్పటికే సెలెక్ట్ అయ్యి, అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ కూడా తీసుకున్నారన్నారు. గ్రూప్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతున్న నేపథ్యంలో గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ ఫోర్, జేఎల్, సబ్ ఇన్‌స్పెక్టర్, డీఎల్‌లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు గ్రూప్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు వచ్చి ఉద్యోగంలో చేరకపోతే ఆ పోస్టు బ్యాక్‌లాగ్‌గానే మిగిలి పోతాయని, గ్రూప్ త్రీ సెలెక్ట్ అయిన వారు తమ కడుపు కొట్టినవారు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.


