కోవిడ్‌ పరీక్షలపై కౌంటర్‌ దాఖలకు ఆదేశం

TS High Court says Give Counter On TS Govt For Coronavirus Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేయడం లేదని దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కరోనా లక్షణాలు ఉన్న వారికి సైతం గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేయడంలేదని పిటీషనర్‌ హైకోర్టుకు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇంకా బెడ్ల వివరాలను ఆయా ఆస్పత్రులు తమ డిస్‌ప్లేలో పెట్టడంలేదని కోర్టుకు తెలియజేశారు. (ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం)

కరోనా బారిన పడిన పేషెంట్ల కోసం 104 హెల్ప్ లైన్ నంబర్ సేవలను ఉపయోగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ హైకోర్టును కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 23(బుధవారం)కు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top