ఎడ్‌సెట్‌లో మహిళల హవా  | TS EDCET: Results For Admission In Teacher Courses | Sakshi
Sakshi News home page

ఎడ్‌సెట్‌లో మహిళల హవా 

Sep 25 2021 3:16 AM | Updated on Sep 25 2021 3:16 AM

TS EDCET: Results For Admission In Teacher Courses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎడ్‌సెట్‌లో 98.53 శాతం మంది అర్హత సాధించారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఉస్మానియా  వర్సిటీ గత నెలలో ఎడ్‌సెట్‌ నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు 42,399 మంది దరఖాస్తు చేసుకోగా, 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు.

వీరిలో 33,683 మంది అర్హత సాధించారు. పురుషులు 7,737 మంది పరీక్ష రాస్తే, 7,700 మంది అర్హత సాధించారు. మహిళలు 26,448 మంది రాస్తే 25,983 మంది ఎడ్‌సెట్‌ అర్హత పొందారు. గతేడాదితో 70 శాతం అర్హత సాధిస్తే... ఈసారి 98.53 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ రామ కృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement