తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల | TS ECET Results 2020 Released | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల

Sep 11 2020 4:13 PM | Updated on Sep 11 2020 5:10 PM

TS ECET Results 2020 Released  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఎస్‌ ఈసెట్‌ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 90.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌) అంశాల్లో గత నెల 31న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్‌ చేసుకోగా 25,448 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ నేపథ్యంలోనూ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయడం శుభపరిణామం అని అన్నారు. పరీక్ష నిర్వహణ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement