HYD: స్పైస్‌ జెట్‌ విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ | Tirupati Spice Jet Flight Emergency Landing | Sakshi
Sakshi News home page

HYD: స్పైస్‌ జెట్‌ విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Jun 19 2025 9:47 AM | Updated on Jun 19 2025 10:30 AM

Tirupati Spice Jet Flight Emergency Landing

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌-తిరుపతి స్పైస్‌ జెట్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, అప్రమత్తమైన పైలట్‌.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ఈ విమానంలో 80 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. శంషాబాద్‌ విమానాశ్రయంలో హైదరాబాద్‌ నుంచి స్పైస్‌ జెట్‌ విమానం తిరుపతి వెళ్తుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే పైలట్‌ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో, అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించి.. ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 80 మంది ప్రయాణీకులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement