ఆగ్రోస్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయసింహారెడ్డి  | Tippana Vijayasimha Reddy Appointed As Telangana Agro Industries Chairman | Sakshi
Sakshi News home page

ఆగ్రోస్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయసింహారెడ్డి 

Dec 12 2022 3:56 AM | Updated on Dec 12 2022 7:46 AM

Tippana Vijayasimha Reddy Appointed As Telangana Agro Industries Chairman - Sakshi

విజయసింహారెడ్డిని అభినందిస్తున్న జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆగ్రోస్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తన కు ఆగ్రోస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తిప్పన విజయసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, గ్యాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement