శ్రీరాంసాగర్‌ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్‌ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు

Published Fri, Mar 8 2024 3:39 PM

Three youths Drowned in Sriramsagar Reservoir Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: మహాశివరాత్రి పండుగపూట నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్‌ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ముప్కాల్‌ మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద శుక్రవారం జరిగింది. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరంతా జక్రాన్‌పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు

యువకులు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


చదవండి: మహాశివరాత్రి నాడు విషాదం.. కరెంట్‌ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు

Advertisement
 
Advertisement