హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనాన్ని థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు, శనివారం నాడు అలాగే ఆదివారం మహాబోధి విహార సికింద్రాబాద్, సాయంత్రం హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలోని సిద్ధార్థ బుద్ధ విహార నుండి బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య సూచన మేరకు హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు.
గగన్ మాలిక్ ఫౌండేషన్ మరియు గుల్బర్గా సిద్ధార్థ బౌద్ధ విహార సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి దమ్మయాత్ర కోసం ఈ బృందం తెలంగాణాకు వచ్చారు, వీరికి బుద్ధవనం ఆర్ట్స్ & ప్రమోషన్ మేనేజర్ శ్యాంసుందర్రావు వీరికి ఇక్కడి బౌద్ధవారసత్వ విశేషాలను, తెలియజేశారు.
బౌద్ధభిక్షువులు హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనం సమర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ స్టేట్ మ్యూజియం లో బౌద్ధదాతువులను, వీక్షించారు, తెలంగాణా రాష్ట్ర రాజధాని, నడిబొడ్డున ప్రశాంత వాతావరణంలో, చారిత్రక హుస్సేన్ సాగర్లో అలనాటి బౌద్ధ వారసత్వాన్ని ఈ బుద్ధుని సందర్శించడం భవిష్యత్ తరాలకు ప్రేరణ కలిగించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.
దక్షిణ భారతంలో తెలంగాణా ప్రపంచ బౌద్ధ బిక్షువులకు బుద్ధవనం, హుస్సేన్ సాగర్ బుద్ధ, మరియు ఇతర బౌద్ధప్రదేశాలు కలిపి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే, బౌద్ధ పర్యాటకులకు ఆరాధన కేంద్రాలుగా విలసిల్లగలవని, వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుద్ధం,సంఘం, బుద్ధం శరణం అనే బుద్ధుని ప్రాథమిక దమ్మ ప్రబోధాన్ని తెలియజేశారు. బుద్ధ ధర్మం గురించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుల్బర్గా నుండి వచ్చిన థాయిలాండ్, కంభోడియా, యు ఎస్ ఏ, భారతదేశానికి చెందిన బౌద్ధ బిక్షులు, ఉపాసకులు పాల్గొన్నారు. వీరిలో థాయిలాండ్ ఉపాసిక లిథ, బుద్ధ విహార గుల్బర్గా నుండి రతన జ్యోతో, తదితరులు పాల్గొన్నారు.


