మరో 2098 మందికి కరోనా | Telangana Reports 2098 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: మరో 2098 మందికి కరోనా

Feb 6 2022 3:33 AM | Updated on Feb 6 2022 7:59 AM

Telangana Reports 2098 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 2,098 మంది కోవిడ్‌–19 బారిన పడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,76,313 మందికి కరోనా వైరస్‌ సోకగా, వారిలో 7,42,988 మంది కోలుకున్నారు. మరో 29,226 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా ప్రభా వంతో శనివారం ఇద్దరు మరణించగా.. ఇప్పటి వరకు 4,099 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 74,803 నిర్ధారణ పరీ క్షలు చేశారు.

వీటిలో మరో 2,131 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌లో భాగంగా శనివారం 1,71,014 డోసులు పంపిణీ చేశారు. ఇందులో 29,318 మొదటి డోసు, 1,33,008 రెండో డోసు, 8,688 బూస్టర్‌ డోసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 5,51,65,713 డోసులు పంపిణీ చేసినట్టు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement