తెలంగాణ: రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు | Telangana: Rainfall May Come Forthcoming 2 Days | Sakshi
Sakshi News home page

Telangana: రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు

Apr 2 2023 8:32 AM | Updated on Apr 2 2023 11:02 AM

Telangana: Rainfall May Come Forthcoming 2 Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కొనసాగిన ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. మరో రెండ్రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 37.9 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 19.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement