కవాడిగూడ : హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అ«ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ బాబూ జగ్జీవన్‌రాం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో నిర్ణయాలు ఉండటం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీఎస్‌బోస్,సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


