Harish Rao: గురుకులాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తాం

Telangana Minister Harish Rao Announcement Over Gurukula Jobs - Sakshi

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

మణికొండ/సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ క్రమబద్ధీక రిస్తామని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్స వాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన హైద రాబాద్‌ శివారు నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో మందుబిళ్లలను పంపిణీ చేశారు.

స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్‌తో కలసి మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరీశ్‌రావు మాట్లా డుతూ విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరి స్థితిని నెలవారీగా సమీక్షించాలని, స్థానిక పీహెచ్‌సీ వైద్యులు తప్పనిసరి గురుకులాలను సందర్శించా లని ఆదేశించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గురుకులాల సంఖ్యను 298 నుంచి 923కు పెంచామని వివరించారు.

అలాగే రాష్ట్రంలోని అన్ని గురుకులాలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, గురుకు లాల కార్యదర్శి రోనాల్డ్‌రాస్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేత మహంతి, నార్సింగి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డి.రేఖయాదగిరి పాల్గొన్నారు. 

తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందించాలి
కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా వీలైనంత తక్కువ ఖర్చుతో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రి లో హ్యూగో రోబోటిక్స్‌ అసిస్టెడ్‌ సిస్టం ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. ప్రజారోగ్యంపై ప్రభు త్వం ఏటా రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలి పారు.  

ఆరోగ్యశ్రీ కేసులు ఎక్కువగా తీసుకో వా లని కేర్‌ ఆస్పత్రికి సూచించారు. రోబోటిక్స్‌  టెక్నా లజీ అందిపుచ్చుకోవడం వల్ల రికవరీ శాతం పెరిగి, రోగి ఆస్పత్రిలో ఉండే సమయం, ఖర్చు తగ్గుతా యన్నారు. కార్యక్రమంలో కేర్‌ బంజారాహిల్స్‌ ప్రసూతి విభాగం అధిపతి డాక్టర్‌ మంజుల అన గాని, ఆస్పత్రి గ్రూప్‌ చీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ నిఖిల్‌ మాథుర్, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపాల్, డాక్టర్‌ పి. వంశీ కృష్ణ, ఆస్పత్రి సీవోవో డాక్టర్‌ నీలేశ్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top