Telangana: కొత్తగా ఐదు కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం నిర్వహించిన 5,818 కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐదు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి ఐదుగురు కోలుకున్నారు.