కొత్తగా 145 కరోనా కేసులు నమోదు | Telangana Logs 145 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 145 కరోనా కేసులు నమోదు

Jun 12 2022 1:29 AM | Updated on Jun 12 2022 2:55 PM

Telangana Logs 145 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 145 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్ప టివరకు రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,94,329కు చేరిం ది. ఇందులో 7,89,241 మంది కోలుకోగా, 977 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతిచెందారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 15,200 మందికి కరోనా పరీక్షలు చేశారు.

ఇందులో 413 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో తాజాగా నమోదైన పా జిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 117 నమోదు కావడం గమనార్హం.  

Advertisement
 
Advertisement
Advertisement