Telangana Inter Exams: తెలంగాణ‌ ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పులు, రీ షెడ్యూల్‌ ఇదే..

Telangana Intermediate Exams Will Start From May 6th, Check Full Details - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం విడుద‌ల చేసింది.

ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు 6 నుంచి మే 23వ తేదీ వ‌ర‌కు, సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు 7 నుంచి 24 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇక ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు వెల్ల‌డించారు.
చదవండి: హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్‌ లేదా.. నో ప్రాబ్లమ్‌!

ఫ‌స్టియ‌ర్ షెడ్యూల్
► మే 6(శుక్ర‌వారం) – సెకండ్ లాంగ్వేజ్
► మే 9(సోమ‌వారం) – ఇంగ్లీష్
► మే 11(బుధ‌వారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్
► మే 13(శుక్ర‌వారం) – మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్ట‌రీ
► మే 16(సోమ‌వారం) – ఫిజిక్స్, ఎక‌నామిక్స్
► మే 18(బుధ‌వారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
► మే 20 (శుక్ర‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1
► మే 23(సోమ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి

సెకండియ‌ర్ షెడ్యూల్
► మే 7(శ‌నివారం) – సెకండ్ లాంగ్వేజ్
► మే 10(మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్
► మే 12(గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్
► మే 14(శ‌నివారం) – మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్ట‌రీ
► మే 17(మంగ‌ళ‌వారం) – ఫిజిక్స్, ఎక‌నామిక్స్
► మే 19(గురువారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
► మే 21 (శ‌నివారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2
► మే 24(మంగ‌ళ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజెస్, జియోగ్ర‌ఫి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top