హైదరాబాద్‌ వాసికి అంతర్జాతీయ గుర్తింపు | Telangana: Hyderabad Elected As Referee International Level Wrestling | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్‌ అంతర్జాతీయ రెఫరీగా హైదరాబాద్‌ వాసి

Nov 22 2021 8:21 AM | Updated on Nov 22 2021 8:24 AM

Telangana: Hyderabad Elected As Referee International Level Wrestling - Sakshi

ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న ఆయన సత్తా చాటడంతో ఆయనను ఎంపిక చేశారు.

సాక్షి,మణికొండ( హైదరాబాద్‌): రెజ్లింగ్‌లో అంతర్జాతీయ రెఫరీగా నార్సింగి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన శ్రీకాంత్‌యాదవ్‌ ఎంపికయ్యారు. గత వారం రోజులుగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న ఆయన సత్తా చాటడంతో ఆయనను ఎంపిక చేశారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పోటీలకు రెఫరీగా పనిచేసే అవకాశం లబించిందని ఆయన విలేకరులతో పేర్కొన్నారు.

అంతర్జాతీయ రెఫరీయింగ్‌ డైరెక్టర్‌ దుర్గే, ఒలంపిక్‌ రిఫరీ అశోక్‌ల చేతుల మీదుగా ఆయన తన అంతర్జాతీయ రెఫరీ దృవపత్రాన్ని అందుకున్నానని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రెజ్లింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే అవకాశం మాత్రమే ఉండేదని, తన ఎంపికతో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసి అవకాశం లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

చదవండి: వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది

Advertisement
 
Advertisement
Advertisement