యాదాద్రిలో హైకోర్టు జడ్జి పూజలు | Telangana High Court Judge Visit Yadadri Temple | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో హైకోర్టు జడ్జి పూజలు

Dec 19 2022 2:50 AM | Updated on Dec 19 2022 2:50 AM

Telangana High Court Judge Visit Yadadri Temple - Sakshi

శ్రీ సుదర్శన నారసింహ హోమంలో హైకోర్టు జడ్జి వెంకటేశ్వరరెడ్డి 

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు జడ్జి వెంకటేశ్వరరెడ్డి, కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఆచార్యులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వా గతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ, ప్రతి ష్టా అలంకార మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ప్రథమ ప్రాకారంలో జరిపించిన శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం తదితర పూజల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. జడ్జికి ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement