యాదాద్రిలో హైకోర్టు జడ్జి మాధవిదేవి  | Telangana High Court Judge Justice Madhavi Devi visit Yadadri Temple | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో హైకోర్టు జడ్జి మాధవిదేవి 

Jan 22 2023 3:01 AM | Updated on Jan 22 2023 3:01 AM

Telangana High Court Judge Justice Madhavi Devi visit Yadadri Temple - Sakshi

యాదగిరిగుట్ట: రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ మాధవిదేవి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆమె గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను దర్శించుకున్నారు.

ముఖ మండపంలో ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన తదితర పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. జస్టిస్‌ మాధవిదేవికి ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement