జస్టిస్‌ సుమలత, జస్టిస్‌ సుదీర్‌కుమార్‌కు హైకోర్టు వీడ్కోలు

Telangana High Court bids farewell to two judges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బదిలీపై ఇతర రాష్ట్ర హైకోర్టుల కు వెళ్తున్న జస్టిస్‌ చిల్లకూర్‌ సుమలత, జస్టిస్‌ ముమ్మినేని సుదీర్‌కుమార్‌లకు హైకోర్టు ఘనంగా వీ డ్కోలు పలికింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫస్ట్‌ కోర్టు హాల్‌లో భేటీ అయిన ఫుల్‌ కో ర్టు వారిద్దరిని సన్మానించింది. జస్టిస్‌ సుమలతను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్‌ సుదీర్‌కుమార్‌ను మ ద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం గత వారం ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. న్యా యాన్ని అందించడంతోపాటు వారిచి్చన పలు తీ ర్పులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరా ధే ప్రశంసించారు.

తీర్పుల వివరాలను అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చదివి వినిపించారు. అనంతరం హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏఏ) బదిలీ అయిన న్యాయమూర్తులను ఘనంగా స న్మానించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ సుమలత మాట్లా డుతూ.. కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయి కి చేరానన్నారు. యువ న్యాయవాదులు కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందని సూ చించారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది పడబోనని.. వెళ్లిన చోట మన తెలంగాణ ప్రతిభను చాటేలా విధులు నిర్వహిస్తానని చెప్పారు. ‘బార్‌’తో కలసి పనిచేస్తానని తాను ప్రమాణం చేసే సందర్భంలోనే చెప్పానని, అలాగే న్యాయవాదుల విజ్ఞప్తులను అనుమతిస్తూ, వీలైనంత వరకు అనుకూలంగా పనిచేశానని జస్టిస్‌ సు«దీర్‌కుమార్‌ అన్నారు. అయితే ‘బార్‌’తో కలసి పనిచేశానా.. లేదా అన్నది న్యాయవాదులు చెప్పాలన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top