సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరితం సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నవంబర్ 18న వాట్సప్‌లో మీసేవల కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. తద్వారా వంద రకాల సేవలను ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి రానున్నాయి. రేషన్ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుకింగ్ , పంటల మార్కెట్ ధరలు, దైవ దర్శనాలు, విద్యార్థి హాజరు, ఇలా... ఎన్నో రకాల సేవలను వాట్సప్ ద్వారా ఇట్టే పొందే వెసులుబాటు తీసుకొస్తోంది.


