ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ.. సీఎస్‌ కీలక ఉత్తర్వులు | Telangana Government Issues Top IFS Officers Transfer Orders | Sakshi
Sakshi News home page

పలువురు ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ 

Feb 17 2021 8:54 AM | Updated on Feb 17 2021 9:37 AM

Telangana Government Issues Top IFS Officers Transfer Orders - Sakshi

ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌గా బి.శ్రీనివాస్‌ నియమితులు కాగా ఆ స్థానంలో పనిచేస్తున్న డా.అశోక్‌ కుమార్‌ సిన్హా ను స్టేట్‌ ట్రేడింగ్‌ సర్కిల్‌ అదనపు పీసీసీఎఫ్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి,హైదరాబాద్‌: అటవీశాఖలో పనిచేస్తున్న పలువురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ములుగులోని ఫారెస్ట్‌కాలేజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ) పర్సన్‌ ఇన్‌చార్జి, డీన్‌గా ఉన్న డా.జి.చంద్రశేఖర్‌రెడ్డిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా పోస్టింగ్‌ ఇచ్చారు. సీఎం కార్యాలయ ఓఎస్డీ /హైదరాబాద్‌ ఆర్‌ అండ్‌ డీ సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ప్రియాంక వర్ఘీస్‌కు ఎఫ్‌సీఆర్‌ఐ పర్సన్‌ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్ప గించారు.

ఇక ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌గా బి.శ్రీనివాస్‌ నియమితులు కాగా ఆ స్థానంలో పనిచేస్తున్న డా.అశోక్‌ కుమార్‌ సిన్హా ను స్టేట్‌ ట్రేడింగ్‌ సర్కిల్‌ అదనపు పీసీసీఎఫ్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ క్యూరేటర్‌గా ఉన్న ఎన్‌.క్షితిజను మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌గా బదిలీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement