ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సతీమణి ఆకస్మిక బదిలీ! | TS Govt Transfers Agriculture Marketing Director Lakshmibai to Housing Federation | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సతీమణి ఆకస్మిక బదిలీ!

Jul 2 2026 4:29 PM | Updated on Jul 2 2026 8:23 PM

TS Govt Transfers Agriculture Marketing Director Lakshmibai to Housing Federation

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విభాగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ అధికారిణి జి. లక్ష్మీబాయిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ప్రస్తుత బాధ్యతల నుండి బదిలీ చేస్తూ, హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఐఏఎస్,ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో భాగంగానే ఈ కీలక స్థానచలనం జరిగినట్లు సచివాలయ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ బదిలీ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ అయిన అధికారిణి లక్ష్మీబాయి, మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి కావడం దీనికి ప్రధాన కారణం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement