బిగ్‌ షాక్‌: రేవంత్‌, ఉత్తమ్‌లకు అధికారుల డీమోషన్‌! | Telangana Formation Day Flexi Error Sparks Criticism, Triggers Social Media Memes | Sakshi
Sakshi News home page

బిగ్‌ షాక్‌: రేవంత్‌, ఉత్తమ్‌లకు అధికారుల డీమోషన్‌!

Jun 3 2026 10:59 AM | Updated on Jun 3 2026 11:44 AM

Telangana Formation Day Flexi Error Sparks Criticism

భానుపురి (సూర్యాపేట): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కారణం.. ఫ్లెక్సీలో హోదాలన్నీ తారుమారయ్యాయి!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో కింద జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) హోదా కనిపించగా, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటో కింద జిల్లా కలెక్టర్ పేరు దర్శనమిచ్చింది. దీంతో "ఒక్క ఫ్లెక్సీతోనే సీఎం డీఈఓగా డిమోట్ అయ్యారా? మంత్రి కలెక్టర్‌గా ప్రమోట్ అయ్యారా?" అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

"ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు అన్నీ పక్కనపెట్టి.. విద్యాశాఖ ఫ్లెక్సీలోనే కొత్త పోస్టింగులు ఇచ్చేసింది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు "ఇది ఫ్లెక్సీనా.. లేక కొత్త గెజిట్ నోటిఫికేషనా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు.

అయితే ఈ సరదా వ్యాఖ్యల వెనుక అధికారిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఒక ఫ్లెక్సీ.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement