8 ప్లాట్ల విక్రయం.. రూ.2500 కోట్లు వస్తుందని అంచనా  | Telangana: E Auction On Kokapet Lands | Sakshi
Sakshi News home page

కోకాపేట భూములు: ‘మహా’ వేలానికి వేళాయె

Jul 15 2021 2:57 AM | Updated on Jul 15 2021 8:24 AM

Telangana: E Auction On Kokapet Lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మరో భారీ భూ వేలానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో సువిశాల రోడ్లతో అభివృద్ధి చేసిన నియోపొలిస్‌ లేఅవుట్‌లోని ప్లాట్లతో పాటు గోల్డెన్‌ మైల్‌ లే అవుట్‌లోని ప్లాటును ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయిస్తోంది. ఎకరానికి కనీస ధర రూ.25 కోట్లుగా హెచ్‌ఎండీఏ నిర్ణయించినా.. అందుకు రెట్టింపు ధర రావడం ఖాయమని ఆ సంస్థ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ లెక్కన రూ.2,500 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తోంది.

8 ప్లాట్ల విక్రయం
రూ.2500 కోట్లు వస్తుందని హెచ్‌ఎండీఏ అంచనా
 
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు...
ప్లాట్‌ నంబర్‌లు: నియోపోలిస్‌ లేఅవుట్‌ ప్లాట్లు 1,2,3,12
మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు...

ప్లాట్‌ నంబర్‌లు: నియోపోలిస్‌ లేఅవుట్‌ ప్లాట్లు 4, 13, ప్లాట్‌ ఏ,  గోల్డెన్‌ మైల్‌ లేఅవుట్‌ ప్లాట్‌ నంబర్‌ 2/పీ/వెస్ట్‌ పార్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement