ఢిల్లీకి సీఎం కేసీఆర్‌ | Telangana Cm KCR Visits Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

Mar 30 2022 10:29 AM | Updated on Mar 30 2022 10:31 AM

Telangana Cm KCR Visits Delhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరికాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10:30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి బయల్దేరనున్నారు. ఆరోగ్యం విషయమై ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ సైతం వెళ్లనున్నారు. అయితే వరి కొనుగోలు అంశంపై కూడా కేసీఆర్‌ కేంద్రంతో చర్చిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ కేవలం ఆరోగ్య పరమైన అంశాలపై మాత్రమే ఢిల్లీ వెళ్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

కాగా ఇటీవలే కేసీఆర్‌ అస్వస్థతకు గురవ్వడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఎడమ చేయి, ఎడమ కాలు నొప్పితో బాధపడుతున్న సీఎం కేసీర్‌కు ఆసుపత్రిలో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. అనంతరం కొన్ని రోజులు సీఎంను విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్‌.. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభకు హాజరై బడ్జెట్‌పై ప్రసంగించారు.
చదవండి: ఉక్రెయిన్‌ విద్యార్థులను ఇక్కడే చదివిద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement