తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు | Telangana Cabinet PowerFul Decisions Nov 25 2025 Deatails here | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Nov 25 2025 4:57 PM | Updated on Nov 25 2025 5:57 PM

Telangana Cabinet PowerFul Decisions Nov 25 2025 Deatails here

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ శివారులో ఉన్న(ORRను ఆనుకుని ఉన్న) మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. అలాగే.. అలాగే విద్యుత్‌ రంగం ప్రధానంగా ఈ భేటీ జరిగినట్లు మంత్రులు వెల్లడించారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాటలాడుతూ.. ఆదిభట్ల, పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి.. ఇలా అర్బన్‌ లోకల్‌బాడీలను జీహెచ్‌ఎంసీలో విలీనానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ఈ 27 మున్సిపాలిటీలు ,కార్పోరేషన్ లను జీహెఎంసీ లో కలపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  జీహెచ్‌ఎంసీని అలాగే ఉంచాలా... లేక విభజించాలా అనేది భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటాం.. 

రాబోయే పదేళ్ళకు సరిపడే విద్యుత్ అవసరం పై సుధీర్ఘంగా చర్చించాం. 2 వేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.  విద్యుత్ వ్యవస్థ లో పారదర్శకత కోసమే కొత్త డిస్కం ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా స్థాపించే పరిశ్రమలకు తామంతట తామే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించాం. ప్రభుత్వ అంతర్గత విషయాలు బయటకు చెప్పేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. దీనికి పై ఎంక్వరీ జరుగుతుంది అని శ్రీధర్‌బాబు అన్నారు. 

ఇంకా కేబినెట్‌ నిర్ణయాలు ఏంటంటే.. 

  • విద్యుత్‌ ఉత్పాదన పెంచేందుకు 3 వేల మెగావాట్ల కోసం టెండర్లకు ఆహ్వానం

  • హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్‌కు ఆమోదం

  • విద్యుత్‌ నెట్‌వర్క్‌ వైర్లన్నీ అండర్‌గ్రౌండ్‌లోనే ఉండేలా ప్రణాళిక అమలు 

  • మహా నగరాన్ని 3 విభాగాలు విభజించి అండర్ గ్రౌండ్ పనులు
  • రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటునకు ఆమోదం 

  • మిషన్‌ భగీరథ, మెట్రో వాటర్‌ సప్లై కొత్త డిస్కం పరిధిలోకి 

  • ఇప్పుడున్న విధానంలోనే పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా 

  • సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుకు ఆమోదం 

  • రామగుండం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించాలని నిర్ణయం

  • ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు 40 ఎకరాల కేటాయింపు
  •  
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు ఏటీసీ ఏర్పాటు 

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సబ్ కమిటీ రికమండేషన్ ప్రకారమే ఇండస్ట్రియల్ పాలసీ జరిగింది. ఔటర్ రింగ్  రోడ్డు లోపల కాలుష్య రహిత నగరం గా మార్చడం కోసమే ఈ నిర్ణయం. గత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి.. మేమూ చేస్తున్నాం. ఇది సరైన నిర్ణయం. హరీష్ రావు, కేటీఆర్ రాజకీయ విమర్శలు మానుకోవాలి.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండం అని కేటీఆర్ సవాల్ చేశారు. గతంలో ఇండస్ట్రీ మినిస్టర్ గా కాలుష్య పరిశ్రమలను ఓ ఆర్ ఆర్ కు అవతల వైపు మల్లించాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ ఏరియా ను హౌసింగ్ ఏరియా మార్చి డబ్బులు దండుకున్నారు. కేటీఆర్ మాటల్లో రవ్వంత నిజం కూడా లేదు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దనే ఔటర్ లోపల ఉన్న పరిశ్రమలు తరలించాలని నిర్ణయం తీసుకున్నాం. కాలుష్యం నుంచి హైదరాబాద్ ను బయటపడేందుకు పరిశ్రమల తరలింపు చేపట్టాం. జనాభా లేని చోటు కు పరిశ్రమలు తరలించడమే మా ప్రయత్నం. ప్రభుత్వం కు లబ్ది చేకూరే నిర్ణయం పై కేటీఆర్ విమర్శలు చేయడం ఏంటి?. కేటీఆర్ తనకు కావాల్సిన వ్యక్తులకు ల్యాండ్ కన్జర్వేషన్ చేశారు. ఆయనలా తన మనుషులకు లబ్ది చేసేలా మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదు. మా పాలసీ అందరికీ ఉపయోగపడుతుంది అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement