
స్థానికేతరులకు కూడా స్పాట్ ప్రవేశాలు
ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియను శుక్రవారం నుంచి మొదలు పెడతారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలోని దోస్త్ కమిటీ గురువారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ రూ.400 రుసుముతో ఆన్‌లైన్ రిజి్రస్టేషన్ చేసుకోవచ్చు. 25 నుంచి 31 వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారు.
ఈ నెల 31న ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. వచ్చే నెల 3వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. వచ్చే నెల 6వ తేదీలోగా సీట్లు వచి్చన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలి. ఇంకా సీట్లు మిగిలిపోతే వచ్చే నెల 11, 12 తేదీల్లో కాలేజీల్లో స్పాట్ ప్రవేశాలను నిర్వహిస్తారు. స్పాట్‌లో సీటు పొందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందే అర్హత ఉండదు. స్పాట్ ప్రవేశాల్లో నాన్ లోకల్ విద్యార్థులు కూడా సీట్లు పొందే అవకాశం కలి్పంచారు. ఈసారి కౌన్సెలింగ్‌లో ఎర్త్ యూనివర్సిటీ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు