Warangal: హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య.. కారణం అదేనా? | Warangal Hanmakonda SR University BSC Student Deepthi Committed Suicide, Details Inside - Sakshi
Sakshi News home page

Warangal: హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య.. కారణం అదేనా?

Jan 12 2024 12:16 PM | Updated on Jan 12 2024 1:18 PM

SR University Deepthi Suicide At Warangal - Sakshi

సాక్షి, హసన్‌పర్తి: హన్మకొండ జిల్లాలోని ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థిని దీప్తి హాస్టల్‌ రూమ్‌లో సూసైడ్‌ చేసుకుంది. ఇక, ఆమె ఆత్మహత్యకు ప్రేమ, పరీక్షల ఫలితాలే కారణమని తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. హన్మకొండలోని ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతున్న దీప్తి ఆత్మహత్య చేసుకుంది. అయితే, దీప్తి తన క్లాస్‌మేట్‌ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు తోటీ విద్యార్థులు చెబుతున్నారు. కాగా, ఇటీవలే వీరి మధ్య గొడవలు కావడం, ఇటీవల వచ్చిన పరీక్ష ఫలితాల్లో ఒక్క సబ్జెక్ట్‌లోనే పాస్‌ అవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దీప్తి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇక, ఆమె ఆత్మహత్య యూనివర్సిటీలలో కలకలం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement