చర్లపల్లి–బర్హంపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు | Special trains between Cherlapalli-Berhampur | Sakshi
Sakshi News home page

చర్లపల్లి–బర్హంపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

Sep 25 2026 6:01 AM | Updated on Sep 25 2026 6:01 AM

Special trains between Cherlapalli-Berhampur

సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి–బర్హంపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు చర్లపల్లి–బర్హంపూర్‌ (07027/07028) స్పెష­ల్‌ ట్రైన్‌ అక్టోబర్‌ 2 నుంచి నవంబర్‌ 28 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు బర్హంపూర్‌ చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బర్హంపూర్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. సీఎస్‌టీ ముంబయి–చెన్నైబీచ్‌ (01015/01016) స్పెషల్‌ ట్రైన్‌ అక్టోబర్‌ 14 నుంచి నవంబర్‌ 19 వరకు ప్రతి మంగళవారం రాత్రి 12.35 (బుధవారం తెల్లవారుజాము)గంటలకు బయలుదేరి బుధవారం రాత్రి 11.30 గంటలకు చెన్నై చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం ఉదయం 4 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 4.05 గంటలకు ముంబయికి చేరుకుంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement