విద్యుదాఘాతంతో పసివాడు మృతి
కొణిజర్ల: ఇంటికి ఎర్త్ వైరు నిమిత్తం ఏర్పాటు చేసుకున్న తీగకు విద్యుత్ సరఫరా జరగడంతో, దానిపై పెట్టిన మూత పట్టుకున్న బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నమునగాలలో గురువారం సాయంత్రం జరిగింది.
గ్రామానికి చెందిన ఇల్లందుల రమే‹శ్ – మమత దంపతుల కుమారుడు అవేద్ (9 నెలలు) ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమాన ఎర్తింగ్ ఏర్పాటు చేసిన గుంతపై మూతగా పెట్టిన స్టీల్ సింక్ పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతానికి గురైన అవేద్ పడిపోగా కుటుంబీకులు ఖమ్మం తీసుకెళ్లేసరికి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.


