మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియా–2026గా ప్రీతి ముండే | Adilabad Preeti Munde won Miss Earth Water India 2026 | Sakshi
Sakshi News home page

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియా–2026గా ప్రీతి ముండే

Sep 25 2026 5:51 AM | Updated on Sep 25 2026 5:51 AM

Adilabad Preeti Munde won Miss Earth Water India 2026

జాతీయ స్థాయి అందాల పోటీల్లో కిరీటాన్ని కైవసం చేసుకున్న ప్రీతి ముండే

ఇంద్రవెల్లి: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ గ్రామానికి చెందిన ప్రీతి ముండే మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియా–2026గా ఎంపికయ్యారు. జైపూర్‌ వేదికగా జరిగిన జాతీ­య అందాల పోటీల్లో తెలంగాణకు ప్రాతి­నిధ్యం వహించి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల్లో ఆమె చూపిన స్నేహపూర్వక స్వభావానికి గాను మిస్‌ కంజీనియాలిటీ–­2026 టైటిల్‌ కూడా సొంతం చేసుకున్నారు.

హీరాపూర్‌ గ్రామానికి చెందిన ఆమె జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటారు. గ్రామీ­ణ ప్రాంతం, సాధారణ కుటుంబంలో జన్మించిన ప్రీతి కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్, ప్రగతి గ్రూప్‌ స్కూల్స్‌లో యోగా టీచర్‌గా సేవలందిస్తున్నారు. మాజీ ఎన్సీసీ కేడెట్, జాతీయ స్థాయి యోగా క్రీడాకారిణి, జ్యోతిష్యు­రాలు, మోడల్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement