ఒక తల్లి పాము..70 పిల్ల పాములు.. | Small Snakes Found In Mahaboobabad District | Sakshi
Sakshi News home page

ఒక తల్లి పాము..70 పిల్ల పాములు..

Mar 29 2021 5:23 AM | Updated on Mar 29 2021 5:23 AM

Small Snakes Found In Mahaboobabad District - Sakshi

మహ్మద్‌ మైబెల్లి ఇంటి పక్కన కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఈక్రమంలో వారు, వారికి  పక్కనే ఉన్న రాతి కట్టడం వద్ద ఒక పాము కనిపించింది. వెంటనే పిల్లలు భయంతో కేకలు వేశారు.

నెల్లికుదురు: మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామం దొమ్మరిగడ్డ వాడలో ఆదివారం పాములు కలకలం రేపాయి. మహ్మద్‌ మైబెల్లి ఇంటి పక్కన కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఈక్రమంలో వారు, వారికి  పక్కనే ఉన్న రాతి కట్టడం వద్ద ఒక పాము కనిపించింది. వెంటనే పిల్లలు భయంతో కేకలు వేశారు. వారి అరుపులు విని  స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారు పాము కనిపించిన విషయాన్ని చెప్పారు.

దీంతో , ఆ చుట్టుపక్కల గాలించారు. వారికి ముందుగా ఒక తల్లిపాము కనిపించింది. ఆ వెంటనే.. ఒకటి దాని వెనుక మరొకటి  దాదాపు 70 పాములు బయటపడ్డాయి. భయపడిపోయిన గ్రామస్థులు వాటిని కట్టేలతో కొట్టి చంపేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement