టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్‌ కేసులో కీలక మలుపు

Sit Decided To Interrogate The Tspsc Members In Paper Leak Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంపై.. టీఎస్‌పీఎస్సీ మెంబర్లను విచారించాలని సిట్‌ నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీలో ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డు చేయనున్నారు.

కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ దూకుడు పెంచింది. పేపర్‌ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్‌ తన కస్టడీకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్‌, సురేష్‌, రమేష్‌ను సిట్‌ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక​, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్‌ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు.

మరోవైపు, పేపర్‌ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌, డాక్యా నాయక్‌తో వీరికి ఉన్న సంబంధాలపై సిట్‌ ఆరా తీస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్‌ అయ్యారు. పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో, అరెస్ట్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
చదవండి: ఆ ఆరు పరీక్షలపై దృష్టి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top