ఆస్తులు రూ.44 కోట్లు.. అప్పులు రూ.96 లక్షలు | Sakshi
Sakshi News home page

ఆస్తులు రూ.44 కోట్లు.. అప్పులు రూ.96 లక్షలు

Published Thu, Nov 9 2023 11:13 AM

Serilingampally BRS MLA Candidate Arekapudi Gandhi Nomination - Sakshi

హైదరాబాద్: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ ఆస్తులు రూ.44,79,93,000 కాగా అప్పులు రూ.96, 34,167గా ఉన్నాయి. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. వీటికి అదనంగా గాంధీ భార్య శ్యామలదేవికి రూ.31,65,38,000 ఆస్తులు ఉండగా అప్పులు రూ.86,34,167 ఉన్నాయి. 

2014లో మాదాపూర్‌ ఠాణా పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన ఆరోపణలతో గాంధీపై ఓ కేసు నమోదైంది. గత ఎన్నికల (2018) అఫిడవిట్‌లో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు పరిష్కారం కావడంతో ప్రస్తుతం గాం«దీకి ఎలాంటి నేర చరిత్ర లేదు.

Advertisement
 
Advertisement