సింగరేణిలో అప్రెంటిస్‌ ఖాళీలు.. త్వరపడండి

SCCL Apprentice Recruitment 2021: Vacancies, Eligibility, Selection Process - Sakshi

ప్రభుత్వరంగ సంస్థ,తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌సీసీఎల్‌)కి చెందిన మానవ వనరుల అభివృద్ధి విభాగం.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్స్, మెషినిస్ట్, మెకానికల్‌ మోటార్‌ వెహికల్, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్, డీజిల్‌ మెకానిక్స్, వెల్డర్స్‌. 

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ విద్యార్థులు అర్హులు కాదు. 

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. 

స్టయిపెండ్‌: రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.8050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.7700 చెల్లిస్తారు. 

లోకల్‌: అప్పటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం(ప్రస్తుతం 16 జిల్లాలు) జిల్లాల అభ్యర్థుల్ని లోకల్‌గాను, మిగతా జిల్లాల అభ్యర్థుల్ని నాన్‌ లోకల్‌గాను పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి 80:20 నిష్పత్తిలో అప్రెంటిస్‌ సీట్ల కేటాయింపు జరుగుతుంది. 

ఎంపిక విధానం: ఐటీఐ ఉత్తీర్ణత సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఒకవేళ చాలా మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే అయితే.. ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
► వెబ్‌సైట్‌: https://scclmines.com/apprenticeship/olApplication.aspx

మరిన్ని నోటిఫికేషన్లు:
పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐలో ఉద్యోగ అవకాశాలు

ఇండియన్‌ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ ఉద్యోగాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top