Hyderabad: ముక్కువోని దీక్షతో..ముక్కే.. కుంచై.. | Satyavolu Rambabu Painted With Nose | Sakshi
Sakshi News home page

Hyderabad: ముక్కువోని దీక్షతో..ముక్కే.. కుంచై..

Jun 25 2024 8:27 AM | Updated on Jun 25 2024 8:36 AM

Satyavolu Rambabu Painted With Nose

⇒కొనతేలిన ముక్కునే కుంచెగా.. అబ్బురపరుస్తున్న చిత్రకారుడు
⇒ఆకర్షించే వందలాది నాసిక చిత్రాలు..
⇒అబ్దుల్‌కలాం ప్రశంసలు.. మరెన్నో అవార్డులు, బిరుదులు..
⇒సత్యవోలు రాంబాబు అసాధారణ ప్రతిభ..  

ఇప్పటి వరకూ పెన్సిల్‌ పెయింటింగ్, హ్యాండ్‌ పెయింటింగ్, నెయిల్‌ ఆర్ట్, బ్రష్‌ ఆర్ట్, నైఫ్‌ ఆర్ట్, ఆఖరికి కాళ్లతోనూ బొమ్మలు వేసేవాళ్లను.. ఇలా.. అనేక రకాల పెయింటింగ్స్‌ వినుంటాం... కానీ అతను ముక్కునే కుంచెగా ఎంచుకున్నాడు.. ముక్కుతో ఆర్ట్‌ ఎలా వేస్తారండీ బాబూ అనొచ్చు... అదే ఇందులో ఉన్న గొప్పతనం.. పూర్తిగా చూస్తూ వేస్తేనే చాలా కష్టమనిపించే ఆర్ట్‌ని ముక్కుతో వేయడమంటే.. ఎంతో టాలెంట్, కృషి,  పట్టుదల ఉండాలి.. ఎందరో ప్రముఖుల చిత్రాలను సైతం తన ముక్కుతో గీసి వారికి అభిమానాన్ని చూరగొన్నాడు. అతడే నిజాంపేటకు చెందిన సద్గురు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఫౌండర్, డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యవోలు రాంబాబు. తన చిత్రకళా ప్రస్థానంలో ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.. ఆయన గురించి మరిన్ని వివరాలు మీ కోసం...    

డాక్టరో..యాక్టరో..సాఫ్ట్‌వేరో..ఇలా తాము ఎంచుకున్న రంగాన్ని ఏలేసేయాలన్న కసితో నగరానికి వచ్చేవారెందరో..వారందరి లాగే ఓ యువకుడు చిత్ర కళను తన ఊపిరిగా చేసుకుని, భుజాన ఓ సంచి..అందులో కొన్ని ఖాళీ పేపర్లు.. నాలుగైదు పెన్సిళ్లు.. చాలన్నట్లు హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. చిత్రకళ కడుపు నింపుతుందా ‘భాయ్‌’.. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా.. అన్నవాళ్లు నోరెళ్లబెట్టేలా చేశాడు.. ఎంచుకున్న కళే జీవితంగా బతికాడు.. రాణించాడు.. మరెందరికో ఆదర్శంగా     నిలిచాడు..  అయితే అందరిలా గుర్తింపు తెచ్చుకుంటే మజా ఏంటి అనుకున్నాడో ఏమో.. కొనదేలిన నాసికాన్నే తన కుంచెగా ఎంచుకున్నాడు. క్షణాల్లో ఔరా.. అనే చిత్రాలను సాక్షాత్కరింపజేస్తున్నాడు.

ముక్కుతో ఏడేళ్ల సాధన 
తన కెరీర్‌లో మామూలు చిత్రకారుడిగా మిగిలిపోకూడదని తన మస్తిష్కంలో మెదిలిన ఆలోచనే నాసికా చిత్రకారుడిగా మలిచింది. ఏడేళ్ల పాటు సాధన చేసి ముక్కును కుంచెగా చేసుకుని వందలాది బొమ్మలను గీసి ఎందరో మన్ననలను పొందారు. ముక్కుతో బొమ్మలు గీసే అరుదైన చిత్రకారుడంటూ అతని ప్రతిభను గుర్తించిన బీబీసీ వార్తా సంస్థ సైతం ప్రశంసించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజల సమక్షంలో నాసికా చిత్రాలు గీశారు. ప్రముఖ కార్టూనిస్ట్‌ జయదేవ్‌ సమక్షంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం బొమ్మను చిత్రించి శభాష్‌ అనిపించుకున్నారు. అబ్దుల్‌కలాం సైతం అబ్బురపడి ప్రశంసిస్తూ రాంబాబుకు లేఖ రాశారు.

లైవ్‌లోనూ మేటిగా.. 
ఒకవైపు నృత్య విన్యాసాలు.. వాటిని అనుకరిస్తూ మరోవైపు ముక్కుతో చిత్రాలు గీయడమంటే ఆషామాషీ కాదు. సంగీత, నృత్య, చిత్ర సంగమంగా గతంలో డిజైర్స్‌ పేరిట రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాంబాబు అసాధారణ ప్రతిభను కనబరిచారు. వేదికపై నృత్యకారిణులు లయబద్ధంగా నృత్యాలు చేస్తుంటే రాంబాబు నాట్యభంగిమలు, హావభావాలను, ముఖ కవళికలను చకచకా చిత్రించి ఔరా అనిపించారు. రెండు నిమిషాలకో చిత్రం చొప్పున కేవలం పది నిమిషాల్లో ఐదు నృత్య భంగిమలకు ప్రాణం పోసి చూపరులను ఆకట్టుకున్నారు.

ఎన్నో అవార్డులు.. ప్రశంసలు..
👉 ఏషియా వేదిక్‌ రీసెర్చ్‌ యూనివర్శిటీ నాసికా చిత్రలేఖనం, సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్‌.
👉   మానవతా స్వచ్ఛంద సంస్థ అమలాపురం వారిచే  చిత్రకళా రత్న అవార్డు.
👉 లంక ఆర్ట్స్‌థియేటర్‌ వారిచే నాసిక చిత్రకళా రత్న.
👉 యువ కళావాహిని వారిచే స్వామి వివేకానంద అఛీవ్‌మెంట్‌ అవార్డు.
👉 లయన్స్‌ క్లబ్‌ ఇంటర్‌నేషనల్‌ వారిచే బెస్ట్‌ టీచర్‌ అవార్డు.
👉 ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ వారిచే బెస్ట్‌  ఆరి్టస్ట్‌ అవార్డు. 
👉   సిరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెయింటింగ్‌ వారిచే గురుబ్రహ్మ అవార్డు.
👉   లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ నుంచి బెస్ట్‌ సరీ్వసు అవార్డు.
👉   సేవ్‌ ఏ లైఫ్‌ ఫౌండేషన్‌ నుంచి బెస్ట్‌ హ్యూమానిటీ అవార్డు.
👉   ఏపీ స్టేట్‌ కల్చరల్‌ సొసైటీ నుంచి స్టేట్‌ బెస్ట్‌ సిటిజన్‌ అవార్డు. 
👉  కాళీపట్నం ఆర్ట్స్‌ అకాడమీ నుంచి కళాప్రతిభ అవార్డు. 
👉    సుధా ఆర్ట్స్‌ అకాడమీ నుంచి కళానిధి అవార్డు. 
👉    జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ నుంచి కళాభిషేకం అవార్డు. 
👉    మెగా రికార్డ్స్‌ సంస్థ నుంచి కళా ప్రతిభ మూర్తి, ఏఎన్‌ఆర్‌  అచీవ్‌మెంట్‌ అవార్డు. 
👉   యశోద ఫౌండేషన్‌ నుంచి కళారత్న అవార్డు.

విశ్వగురు అవార్డ్స్‌ను స్థాపించి..
విభిన్న రంగాల్లో మేటిగా సేవలందించే వారిని గుర్తించి వారిలో నూతనోత్తేజాన్ని కలిగించాలన్న ఉద్దేశ్యంతో విశ్వగురు అవార్డ్స్‌ను 
నెలకొల్పి ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఏటేటా ఎంపిక చేసిన వారికి ఈ అవార్డులను అందించి సన్మానించడం ఆనవాయితీ. అలాగే 
నిజాంపేటలో సద్గురు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ద్వారా చిత్రకళ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శిక్షణ అందిస్తున్నారు.

రెండు దశాబ్దాల క్రితం..
ఓ 20 ఏళ్ల క్రితం..అసలు చిత్రకళ అంటే అంతగా పట్టించుకోని రోజులు.. పశి్చమ గోదావరి జిల్లా వేగివాడకు చెందిన సత్యవోలు రాంబాబు పాఠశాల స్థాయిలో చిత్రకళపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. తన గురువు ఇజ్రాయిల్‌ ప్రేరణతో పాఠశాల స్థాయిలోనే లోయర్, హయ్యర్‌ పూర్తి చేశారు. 20 ఏళ్ల ప్రాయంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకుని చిత్రకళపై తనకున్న అభీష్టాన్ని చాటిచెప్పాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 

చదివింది ఇంటరీ్మడియెట్‌ అయినా కళలో తనకున్న ప్రావీణ్యాన్నే నమ్ముకుని హైదరాబాద్‌ వచ్చేశాడు. అడపాదడపా జరిగే పోటీల్లో పాల్గొనడం, అక్కడ ఇచ్చే పారితోíÙకంతో జీవితాన్ని నెట్టుకురావడం చేశాడు. ఇంటర్‌తో ఆగిపోయిన చదువును కొనగించాలని డిగ్రీలో చేరి మరోవైపు చిత్రకళను కొనసాగించారు. అలా తన ప్రస్థానం మొదలై ఎందరికో ఆ కళను పంచే స్థాయికి ఎదిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement