‘సాక్షి’ పాత్రికేయుడు  వీఆర్‌ కన్నుమూత

Sakshi Senior Journalist Patnaikuni Venkateswararo Reported With Corona

సాక్షి హైదరాబాద్ ‌: సీనియర్‌ జర్నలిస్ట్, తెలుగు భాషాభిమాని పట్నాయకుని వెంకటేశ్వరరావు(58) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్‌ అరెస్ట్‌ వల్ల ఆయన మరణించినట్లు గురువారం రాత్రి  వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం కాపు గోదాయవలస అనే గ్రామంలో జన్మించిన ఆయన 30 ఏళ్లుగా పలు ప్రధాన పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం సాక్షి హైదరాబాద్‌ కార్యాలయంలో డిప్యూటీ న్యూస్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పత్రికా రంగంలో పనిచేస్తూనే.. తెలుగు భాషపై ఉన్న మమకారంతో వీఆర్‌ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ‘వారం వారం తెలుగు హారం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మ భాష గొప్పతనాన్ని పదుగురికి తెలియజెప్పేలా ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, కవులతో తన చానల్‌ ద్వారా ప్రతి ఆదివారం లైవ్‌ షో నిర్వహించేవారు. పట్నాయకుని వెంకటేశ్వరరావు(వీఆర్‌) మృతి పట్ల ‘సాక్షి’ కుటుంబం ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top