హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో-ఇన్‌ఛార్జ్ నియామకం విషయంలో ఎఐసీసీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సచిన్ సావంత్‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో-ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. తాజా రాజకీయ మార్పుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త నియామకం చేపట్టింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కో-ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్టు కేసీ వేనుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు సచిన్ సావంత్ పార్టీకి దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మీనాక్షీ నటరాజన్‌కు సహాయకుడిగా సచిన్ సావంత్ సేవలందించనున్నారు.
యువ నాయకత్వం, జాతీయ స్థాయిలో పార్టీపై నిబద్ధత చూపిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. తెలంగాణలో రాబోయే మున్సిపల్, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం చేయడం, కేడర్‌ను సమన్వయం చేయడం లక్ష్యంగా ఆయన నియామకాన్ని హైకమాండ్ నిర్ణయించింది.


