అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా | RTC Bus Accident In Vikarabad District | Sakshi
Sakshi News home page

అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా

Nov 20 2022 1:14 PM | Updated on Nov 20 2022 1:29 PM

RTC Bus Accident In Vikarabad District - Sakshi

వికారాబాద్ జిల్లా: జిల్లాలోని అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 29 మంది స్వల్పంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వికారాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతగిరిలో మైసవ్వ చిన్న గుట్ట దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్రేన్‌ ద్వారా బస్సుని వెలికి తీశారు. కాగా, బస్సు బ్రేకులు సక్రమంగా లేవని అధికారులకు డ్రైవర్‌ చెప్పినా పట్టించుకోలేదని తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement