అమెరికన్‌ కాన్సులేట్‌ రోడ్డుకు ‘ట్రంప్‌’ పేరు | Revanth Reddy proposed naming a Hyderabad road Donald Trump Avenue | Sakshi
Sakshi News home page

అమెరికన్‌ కాన్సులేట్‌ రోడ్డుకు ‘ట్రంప్‌’ పేరు

Jun 16 2026 12:41 AM | Updated on Jun 16 2026 12:41 AM

Revanth Reddy proposed naming a Hyderabad road Donald Trump Avenue

‘డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ’గా నామకరణం.. 23న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ రోడ్డుకు ‘డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ’ పేరిట నామకరణం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ’గా నామకరణం చేసిన ఈ రోడ్డును ఈ నెల 23న సీఎం అధికారికంగా ప్రారంభిస్తారు. భారతదేశంలో అమెరికా రాయ బారి సెర్జియో గోర్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. జూలై 4న జరిగే అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలను గౌరవించే సాంప్రదాయంలో భాగంగా ట్రంప్‌ పేరిట నా మకరణం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థల సేవల ను గుర్తిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థల పేర్లతో కూడా రహదారులకు నామకరణం చేసే ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తు న్నట్లు సమాచారం.

తెలంగాణను ఆవిష్కరణల కు కేంద్రంగా, ప్రపంచ ఐటీ రంగానికి ప్రతీకగా నిలబెట్టడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమ ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ఢిల్లీలో జరిగిన యూఎస్‌–ఇండియా వ్యూహాత్మ క భాగస్వామ్య వేదిక (యూఎస్‌ఐఎస్పీఎఫ్‌) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ ప్రతిపాదనను వెల్లడించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement