సైబర్‌ నిపుణులు కావాలి! 

Recruitment of technicians on contract basis - Sakshi

సాంకేతిక నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీచేస్తున్న హోంశాఖ

నెలకు రూ.65 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు వేతనం   

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ సైబర్‌ నిపుణులను రంగంలోకి దించనుంది. ఇండియన్‌ సైబర్‌ క్రైం కో–ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ)లో కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేసేందుకు సైబర్‌ సాంకేతిక నిపుణులు కావాలంటూ కేంద్ర హోంశాఖ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పలు అంశాలకు సంబంధించి నిపుణులకు వారి అనుభవం ఆధారంగా నెలకు రూ.65 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు వేతనం ఇవ్వనున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నా రు.

ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థులు https://tcil.net.in/ current &opening.php పై క్లిక్‌ చేసి అందు లోని వివరాలు చూడవచ్చని తెలిపారు. కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేసే వీరికి కేంద్ర హోంశాఖకు ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు.  

అర్హతలు, అనుభవం, వేతనం... 

  • సీనియర్‌ టెక్నికల్‌ ప్రోగ్రాం మేనేజర్‌: ఉండాల్సిన స్కిల్స్‌..సైబర్‌ సెక్యూరిటీలో పనిచేసిన అనుభవం, సెక్యూరిటీ స్ట్రాటజీ, పాలసీ ఫార్ములేషన్, ప్లానింగ్‌. నెలకు వేతనం..రూ. 2,50,000 
  • థ్రెట్‌ మేనేజ్మెంట్‌ ప్రొఫెషనల్‌: ఉండాల్సిన స్కిల్స్‌..సెక్యూరింగ్‌ క్రిటికల్, సెన్సిటివ్‌ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌. నెలకు వేతనం..రూ.1,60,000 
  • డాటా ఎనలైటిక్స్‌ ప్రొఫెషనల్‌: నెలకు వేతనం..రూ.1,60,000 
  • సైబర్‌ క్రైం రీసెర్చర్‌: ఉండాల్సిన స్కిల్స్‌..యూపీఐ, ఐఎంపీఎస్, ఏఈపీఎస్‌ వంటి పేమెంట్స్‌ టెక్నాలజీపై అవగాహన, ఆర్బీఐ, ఇతర నిబంధనలపై అవగాహన..నెలకు వేతనం..రూ. 1,60,000. 
  • మాల్‌వేర్‌ రీసెర్చర్‌: ఉండాల్సిన స్కిల్స్‌.. ఫిషింగ్‌ ఎటాక్స్, మాల్‌వేర్‌ ఎటాక్స్‌లపై పూర్తి అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 
  • సైబర్‌ క్రైం రీసెర్చర్‌–టెలీకాం అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: ఉండాల్సిన స్కిల్స్‌..4జీ, 5జీ వంటి టెలికమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై, సిమ్‌బాక్స్, వీఓఐపీ వంటి అంశాల్లో అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌: ఉండాల్సిన స్కిల్స్‌.. ఎంఎస్‌ ఎక్సెల్, ఫైనాన్స్‌ అంశాలపై అవగాహన ఉండాలి.. నెలకు వేతనం.. రూ.65,000 
  • సైబర్‌ థ్రెట్‌ అనలిస్ట్‌: ఉండాల్సిన స్కిల్స్‌.. సోషల్‌ మీడియా అనాలసిస్, రిపోర్ట్‌ క్రియేషన్, క్రైం రీసెర్చ్‌లో అవగాహన..నెలకు వేతనం.. రూ.65,000 
  • ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌: ఉండాల్సిన స్కిల్స్‌.. మోరాకో ప్రోగ్రామింగ్‌ ఎక్సెల్‌ ఆటోమైజేషన్‌లో అవగాహన.. నెలకు వేతనం..రూ.65,000  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top