పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన డాక్టర్ శిరీష | Pulipaka Sireesha Delivers Her First Child At Own Workplace In Godavarikhani Government Hospital | Sakshi
Sakshi News home page

తాను పనిచేసే ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం..!

Jun 18 2026 9:04 AM | Updated on Jun 18 2026 10:12 AM

Pulipaka Sireesha Delivery In Government Hospital

సిరిసిల్లటౌన్‌:   ప్రభుత్వ వైద్య సేవలపై విశ్వాసానికి నిదర్శనంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లోని పీడియాట్రిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పులిపాక శిరీష తొలికాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శిరీష ప్రసవం కోసం తాను పనిచేస్తున్న జీజీహెచ్‌నే ఎంచుకోవడం విశేషం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవల నాణ్యతపై ఆమెకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలిచింది. 

గైనకాలజీ విభాగాధిపతి అరుణ, అనెస్తీషియా భాను పర్యవేక్షణలో శిరీషకు సిజేరియన్‌తో ప్రసవం చేశారు. తల్లీశిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిరీష భర్త డాక్టర్‌ తాడమల్ల విక్రమ్‌ గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా సేవలందిస్తున్నారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ హిమబిందు సింగ్, ఆర్‌ఎంవో కృపాభాయి.. శిరీష దంపతులను అభినందించారు.  

 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement