‘ఆ సమయంలో మోదీ చెవులు మూసుకున్నారు’

Professor Kodandaram Fires on Narendra MOdi - Sakshi

సాక్షి, ఖమ్మం : సీపీఐ (ఎంల్) అఖిల భారత రైతు కూలి సంఘం అధ్యర్యంలో ఖమ్మం నగరంలో పెవిలియన్ గ్రౌండ్లో రైతు గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ఢిల్లీ రైతు ఉద్యమ నేత ఆశిష్ మిట్టల్, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వెంకట రామయ్య, ప్రోపెసర్ కోదండరామ్‌తో పాటు ఇతర నేతలు పాల్గోన్నారు. రైతులు కూడ భారీ ఏత్తున తరలివచ్చారు. పంజాబ్ నుంచి మొదలైన ఈ ఉద్యమం, హర్యానా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతంతో పాటు దేశం లోని అన్ని ప్రాంత రైతులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమ నేత ఆశిష్ మిట్టల్‌ మాట్లాడుతూ.. ఈ ఉద్యమం సిక్కులదని ప్రధాని మోదీ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశ స్వాతంత్య్రంలో కూడా సిక్కులు ప్రముఖ పాత్ర పోషించారన్న విషయం గుర్తించుకోవాలన్నారు. రైతు చట్టంలో రైతులకు నష్టం చేసే విషయాలు మేము చెప్పే సమయంలో మోదీ మా మాటలు చెవులు మూసుకొని విన్నారని ఎద్దేవ చేశారు.

ప్రోఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఊళ్ళలో భార్యలు, కొడుకులు వ్యవసాయం చేస్తుంటే రైతులు ఢిల్లీలో పోరు సాగిస్తున్నారన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలతో కార్పొరేట్ శక్తులకు స్వేచ్చ వచ్చిందన్న కోదందరామ్.. ఈ చట్టాలు రైతులను, రైతు కుటుంబాలను రోడ్డు మీద పడివెస్తున్నయని అందుకే రైతులు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కార్పొరేట్ శక్తులు చెప్పిన పంట పండించాల్సి వస్తోందని, వాళ్ళు చెప్పిన రేటుకే అమ్మలని ఈ చట్టం చెబుతున్నాయన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top