సీరియస్‌గా ఉన్న డీజీపీ, వారే టార్గెట్‌ | Police Conducted a Massive Cumbing in Asifabad | Sakshi
Sakshi News home page

సీరియస్‌గా ఉన్న డీజీపీ, వారే టార్గెట్‌

Sep 5 2020 9:29 AM | Updated on Sep 5 2020 9:29 AM

Police Conducted a Massive Cumbing in Asifabad - Sakshi

సాక్షి,కొమరం భీం (ఆదిలాబాద్‌): అసిఫాబాద్ జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్‌ నిర్వహించారు. కేబీఎమ్‌ కమిటీ కార్యదర్శి భాస్కర్ నేతృత్వంలోని మావోయిస్టులే టార్గెట్‌గా పోలీసులు దీనిని చేపట్టారు. ఇటీవలే రెండు సార్లు మావోయిస్ట్‌లు తప్పించుకోవడంపై డీజీపీ మహేందర్‌ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డీజీపీనే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థిని సమీక్షిస్తున్నారు. పోలీస్‌ బాస్‌ డీజీపీతో పాటు అధికారులు, ఇంటెలిజెన్స్‌ బృందాలు నాలుగురోజులుగా అసిఫాబాద్‌లోనే మకాం వేశారు.

చదవండి: మావోయిస్టులను గట్టి దెబ్బ కొడతాం: డీజీపీ

Advertisement
 
Advertisement
Advertisement