ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. రవికుమార్‌ దాచిన హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం! Phone Tapping Case: Innovation Lab Hard Disks Seized. Sakshi
Sakshi News home page

ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ‘ఇన్నోవేషన్‌’ రవికుమార్‌ దాచిన హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం!

Jun 18 2024 10:56 AM | Updated on Jun 18 2024 12:10 PM

Phone Tapping Case: Innovation Lab Hard Disks Seized

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్‌ఐబీకి టెక్నికల్‌ సపోర్ట్‌ అందించిన ఇన్నోవేషన్‌ ల్యాబ్‌, ఆ సంస్థ చైర్మన్‌ రవికుమార్‌ ఇంటి నుంచి హార్డ్‌ డిస్క్‌లను సిట్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ కంపెనీ చైర్మన్‌ రవికుమార్‌కు చెందిన బెంగళూరు, హైదరాబాద్‌ ఇళ్లలో.. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఆఫీసుల నుంచి మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్‌లు, హార్డ్‌ డిస్క్‌లను తమ వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ల్యాబ్‌ ప్రతినిధుల స్టేట్మెంట్లను సైతం సిట్‌ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రవికుమార్‌ ఇంట్లో దాచిన హార్డ్‌ డిస్క్‌లను సైతం సిట్‌ సేకరించినట్లు తెలుస్తోంది. 

ఇక.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నిందితుడు ప్రణీత్‌ రావు ఈ ల్యాబ్‌ సహకారమే తీసుకున్నట్లు ఇదివరకే నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు మూడు జిల్లాల్లో ల్యాబ్‌ మినీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటులో రవికుమార్‌ కీలక పాత్ర పోషించినట్లు సిట్‌ నిర్ధారించుకుంది. ఈ క్రమంలో తాజాగా సేకరించిన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరణ దర్యాప్తును మలుపు తిప్పుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రవికుమార్‌ను విచారణ చేపడతారా? నోటీసులు ఏమైనా జారీ చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement