‘జ్యోతి రావు ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలి’ | PCC Chief Mahesh Kumar On Jyotirao Phule Movie | Sakshi
Sakshi News home page

‘జ్యోతి రావు ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలి’

Jun 28 2025 8:38 PM | Updated on Jun 28 2025 9:33 PM

PCC Chief Mahesh Kumar On Jyotirao Phule Movie

హైదరాబాద్‌:  చక్కటి సందేశాన్నిచ్చే జ్యోతిరావు ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలన్నారు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌. ఈరోజు(శనివారం, జూన్‌ 28) పంజాగుట్ట పీవీఆర్‌ సినిమాస్‌లో జ్యోతిరావు ఫూలేచిత్రాన్ని చూసిన మహేష్‌ కుమార్‌ గౌడ్‌.. కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన కథను కళ్ళకు కట్టినట్లుగా పూలే చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. 

సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే జ్యోతి రావు పూలే తన భార్యను చదివించాడు. మహిళలు చదువుకుంటే నేరంగా పరిగణించే రోజుల్లో అగ్రవర్ణ సమాజాన్ని ఎదురించి సావిత్రిబాయిని చదివించి యావత్ మహిళా లోకానికి నూతన ఒరవడి సృష్టించారు. 

నేడు బహుజనులు చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చామంటే జ్యోతి రావు పూలే కృషి వల్లే. పూలే చిత్ర నిర్మాతలు  డైరక్టర్  చిత్రంలోని నటీనటులకు అభినందనలు. రాహుల్ గాంధీతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు  పులే చిత్రాన్ని వీక్షిస్తున్నారు. మన రాష్ట్రంలో పులే చిత్రానికి టాక్స్ మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. మన  భవిష్యత్తుకు ఆనాడు పూలే  ఎంత కృషి చేశారో ఈ చిత్రం ద్వారా అర్ధం అవుతుంది’ అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement