కోర్టుల సంఖ్య పెంచాలి 

The number of courts should be increased - Sakshi

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే 

హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌గా  హుజూర్‌నగర్‌ అదనపు జిల్లా కోర్టు ప్రారంభం  

హుజూర్‌నగర్‌: పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గించడానికి కోర్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం  ఉందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే అన్నారు. మంగళవారం సూ ర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ అదనపు జిల్లా కోర్టును హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజూర్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తమ కేసుల కోసం జిల్లా న్యాయ స్థానాన్ని ఆశ్రయించటానికి పడుతున్న వ్యయ ప్రయాసలను దృష్టిలో పెట్టుకుని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సభ్యుల విజ్ఞప్తి మేరకు హుజూర్‌నగర్‌కు జిల్లా అదనపు న్యాయస్థానాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యార్థమే అదనపు జిల్లా కోర్టు మంజూరు చేశామని,  కోర్టు ప్రారంభమైనందున ఈ ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా సత్వర న్యాయం ల భించడానికి మార్గం సుగమమైందన్నారు.

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వినోద్‌ కుమార్, జస్టిస్‌ లక్ష్మణ్, సూర్యాపేట పోర్టుపోలియో జడ్జి జస్టిస్‌ శ్రీ సుధా, జస్టిస్‌ సుజన వర్చువల్‌గా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, సీనియర్‌ సివిల్‌ జడ్జి జిట్టా శ్యాంకుమార్, జూనియర్‌ సివిల్‌ జడ్జి మారుతి ప్రసాద్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షు డు సాముల రాంరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top