తెలంగాణ: ఆదివాసీ పశువుల కాపరిపై అటవీ అధికారి దాడి చేశారనే ఆరోపణలతో నిర్మల్ జిల్లాలో ఆందోళన నెలకొంది. పెంబి మండలం లోతోర్రే గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి మేకలను మేపేందుకు వెళ్లిన ఆదివాసీ పశువుల కాపరి శేషారావును డీఆర్‌ఓ ప్రతాప్ నాయక్ చితకబాదినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనలో గాయపడిన శేషారావును చికిత్స నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అటవీ అధికారుల తీరును నిరసిస్తూ ఆదివాసీలు పెంబి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సంబంధిత అటవీ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గంగానదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి


