3 నెలల కిత్రమే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి.. భర్తతో గొడవపడి | Newly Married Woman Goes Missing At Ranga Reddy | Sakshi
Sakshi News home page

3 నెలల కిత్రమే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి.. భర్తతో గొడవపడి

Jun 7 2022 12:40 PM | Updated on Jun 7 2022 3:11 PM

Newly Married Woman Goes Missing At Ranga Reddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి: తల్లిదండ్రులు లేనిది చూసి ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ నరేందర్‌ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం, పుల్జాల గ్రామానికి చెందిన బులిగం బాలరాజ్‌ కుటుంబ సభ్యులతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం రాగన్నగూడ సమీపంలో నివాసం ఉండేవారు. బాల్‌రాజ్‌కు సాగరిక అనే కుతురు ఉంది. మూడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి ఎడ్ల అంజి అనే యువకుడిని ప్రమ వివాహం చేసుకుంది. అప్పట్లోనూ మిస్సింగ్‌ కేసు నమోదైంది.

అప్పటి నుంచి ఉప్పునుతల మండలం, అయ్యవారిపల్లిలో నివాసం ఉండేవారు. అంజితో సాగరిక గొడవపడి పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ నెల 5న ఇంట్లో ఎవరి లేని సమయంలో సాగరిక(19) బయటకు వెళ్లింది. ఎక్కడికి వెళ్లిందోనని కుటుంబ సభ్యులు చుట్టూ ప్రక్కల వారిని బంధువులను అడిగిన ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి బాలరాజు సోమవారం ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు విచారిస్తున్నట్లు సీఐ నరేందర్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement